ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 20, 2020 , 10:17:27

ఫైనల్లో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా: రవి బిష్ణోయ్‌

ఫైనల్లో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా: రవి బిష్ణోయ్‌

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఇండియా లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన తాము తక్కువ స్కోరుకే పరిమితమయ్యామని తెలిపిన రవి.. ఛేదనకు దిగిన బంగ్లాను నిలువరించేందుకు చాలా ప్రయత్నించానన్నాడు. ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టి, ఇండియా విజయంపై ఆశలు రేకిత్తించాడు. కానీ, లక్ష్యం మరీ చిన్నది కావడంతో భారత్‌ ఓడిపోయింది. ఇక తాను భారత దిగ్గజ స్పిన్నర్‌, మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే వద్ద ఫ్లిప్పర్‌ బంతులు వేయడం నేర్చుకుంటానని అన్నాడు. వికెట్లు పడగొట్టడంలో, బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టడంలోఈ బంతులు బాగా ఉపయుక్తంగా ఉంటాయని రవి తెలిపాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రవి, టోర్నీలో రాణించి.. భారత జట్టుకు ఆడడమే లక్ష్యమని అంటున్నాడు. 


logo