సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 00:36:15

సెరెనాకు గాయం!

సెరెనాకు గాయం!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సన్నాహకంగా జరుగుతున్న టోర్నీ నుంచి అమెరికా స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ వైదొలిగింది. టాప్‌ ర్యాంకర్‌ ఆష్లే బార్టీతో శుక్రవారం మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో తలపడాల్సి ఉండగా.. కుడిభుజం కారణంగా సెరెనా పోటీ నుంచి తప్పుకుంది. మరో మూడు రోజుల్లో అసలు టోర్నీ ప్రారంభం కానుండడంతో విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకోవాలని విలియమ్స్‌ నిర్ణయించుకుంది. మార్గరెట్‌ కోర్ట్‌ 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేయాలని నాలుగేండ్లుగా  పోరాడుతున్న సెరెనా.. ఈసారైనా ఆ మైలురాయిని చేరాలని పట్టుదలగా ఉంది. 

VIDEOS

logo