సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 02, 2021 , 03:48:26

కరోనా విరామం కలిసొచ్చింది: సెరెనా

కరోనా విరామం కలిసొచ్చింది: సెరెనా

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ కారణంగా తనకు లాభమే జరిగిందని అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ పేర్కొంది. ఈ విరామం వల్ల తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోగలిగానని వెల్లడించింది. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌ సందర్భంగా గాయపడ్డ సెరెనా ఆ తర్వాత ఏ టోర్నీలోనూ బరిలో దిగలేదు. ‘గాయం కారణంగా ప్రాక్టీస్‌ చేయలేదు. ఒకవేళ షెడ్యూల్‌ ప్రకారం టోర్నీలు జరిగుంటే నేను కచ్చితంగా ఆడలేకపోయేదానిని. సమయం కావాలనుకున్నా. అనుకోకుండా ఇలా కలిసొచ్చింది’అని సెరెనా పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి దిగిన సెరెనా సోమవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 6-1, 6-4తో గారిలోవాపై నెగ్గింది. ఏడుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన సెరెనా ఎనిమిదోసారి టైటిల్‌ సాధించాలనే కృతనిశ్చయంతో బరిలో దిగనుంది. ఈ నెల 8 నుంచి ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


VIDEOS

logo