గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 01, 2020 , 22:48:54

సెరీనా విలియమ్స్‌ పంచ్‌ అదుర్స్‌!

సెరీనా విలియమ్స్‌ పంచ్‌ అదుర్స్‌!

న్యూయార్క్‌: సెరీనా విలియమ్స్‌ ఏంటి.. పంచులేంటి అనుకుంటున్నారా? అమెరికా నల్ల కలువ సెరీనా ఇటీవల బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆమె బాక్సింగ్‌ బ్యాగ్‌కు కిక్‌ ఇస్తుంటే బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ వావ్‌ అంటూ మెచుకున్నాడు. సెరీనా.. మైక్‌ టైసన్‌ వద్ద బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంది. 

బాక్సింగ్‌ బ్యాగ్‌ను వెనుకనుంచి మైక్‌ పట్టుకోగా, సెరీనా పంచ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సెరీనాకు చాలా పవర్‌ ఉందని మైక్‌ టైసన్‌ ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. అలాగే, ఈ మేకతో రింగ్‌లో నేను తలపడలేను అంటూ సరదా ట్వీట్‌ చేశాడు. ఈ  వీడియోకు నెటిజన్లనుంచి భారీ స్పందన వస్తున్నది. వెరీ గుడ్‌ సెరీనా.. నువ్వు మరిన్ని గ్రాండ్‌స్లామ్‌లు గెలువాలి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo