శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 12:22:41

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెరీనాకు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెరీనాకు షాక్‌

హైద‌రాబాద్‌:  ఆస్ట్రేలియన్‌ ఓపెన్ నుంచి సెరీనా విలియ‌మ్స్ ఔటైంది. గ‌తంలో ఏడు సార్లు చాంపియ‌న్‌గా నిలిచిన సెరీనాకు.. మూడ‌వ రౌండ్‌లో చైనాకు చెందిన వాంగ్ కియాంగ్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. మెల్‌బోర్న్‌లో జ‌రిగిన టోర్నీలో..  వాంగ్ 6-4, 6-7, 7-5 స్కోర్ తేడాతో ఈ మ్యాచ్‌ను స్వంతం చేసుకున్న‌ది.  థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికా ప్లేయ‌ర్ సెరీనా.. గెలుపు కోసం తీవ్ర ప్ర‌య‌త్నం చేసింది.  కానీ త‌న 24వ గ్రాండ్‌స్లామ్ క‌లకు మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. నిజానికి రెండ‌వ సెట్‌లో 5-4 స్కోర్ వ‌ద్ద మ్యాచ్ కోసం వాంగ్ స‌ర్వ్ చేసినా.. సెరీనా మాత్రం త‌న అనుభ‌వాన్ని ప్ర‌ద‌ర్శించింది, ఆ సెట్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.  రెండ‌వ సెట్‌లో రిక‌వ‌రీ చేసినా.. మూడ‌వ సెట్‌ను మాత్రం హోరాహోరీ పోరులో సెరీనా కోల్పోయింది.  అత్య‌ధికంగా సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ను గెలుచుకున్న‌ మార్గ‌రెట్ కోర్టు రికార్డును స‌మం చేసేందుకు సెరీనా మ‌రో టోర్నీ వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. 


logo