గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 00:49:41

సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు వహీద్‌ మృతి

సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు వహీద్‌ మృతి

ఇందూరు: నిజామాబాద్‌ సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఎంఏ వహీద్‌ (65) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. వహీద్‌కు భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. జాతీయస్థాయి పోటీల్లో చాలా సార్లు ప్రాతినిధ్యం వహించిన వహీద్‌ అద్భుత ఆటతీరుతో చిరస్మరణీయ విజయాలందించాడు. ఆటతీరుతోనే కాక జిల్లా జట్లకు కోచ్‌, మేనేజర్‌గా ఆయన ఎన్నో సేవలందించారు. వహీద్‌ మేనేజర్‌గా ఉన్నప్పుడు లెక్కకు మిక్కిలి కప్పులు గెలిచామని క్రీడాభిమానులు గుర్తు చేసుకున్నారు.  క్రీడారంగానికి ఆయన లేని లోటు తీరనిదని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షకీల్‌ అహ్మద్‌ అన్నారు. వహీద్‌ మృతి పట్ల రాష్ట్ర అధ్యక్షుడు రఫత్‌ అలీ, కార్యదర్శి ఫాల్గుణ, అంతర్జాతీయ ప్లేయర్‌ సౌమ్య, క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.  


logo