హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ రాజా రిత్విక్ గ్రాండ్‌మాస్టర్(జీఎం) హోదాకు మరో అడుగు దూరంలో ఉన్నాడు. స్లోవేకియా వేదికగా జరిగిన స్కాలికా ఇంటర్నేషనల్ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లతో రిత్విక్ రెండో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. టోర్నీలో ఆరు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమితో రన్నరప్‌గా నిలిచాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ తెలంగాణ కుర్రాడు తన కంటే మెరుగైన ర్యాంక్‌ల్లో గ్రాండ్మాస్టర్లపై అద్భుత విజయాలు సాధించాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన ద్వారా 22 పాయింట్లు దక్కించుకున్న రిత్విక్ ప్రస్తుతం 2483 రేటింగ్‌లో కొనసాగుతున్నాడు.