శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 18:43:57

ఆఫ్ఘాన్‌ క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ భార్య అనుష్కశర్మనట?

ఆఫ్ఘాన్‌ క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ భార్య అనుష్కశర్మనట?

న్యూఢిల్లీ: అనుష్కశర్మ ఎవరు? అంటే చాలామంది ఠక్కున చెబుతారు.. ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌కొహ్లీ భార్య అని. కానీ, గూగుల్‌ మాత్రం తప్పుడు సమాధానం ఇస్తోంది. అనుష్కశర్మ.. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ భార్య అని చూపిస్తోంది. గూగుల్‌ సెర్చ్‌లో రషీద్‌ఖాన్‌ భార్య అని కొట్టగానే అనుష్కశర్మ పేరు కనిపిస్తుండడంతో అటు కొహ్లీ,ఇటు అనుష్కశర్మ అభిమానులతోపాటు నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ఇలా ఎందుకు చూపిస్తున్నదంటే..?

ఆప్ఘనిస్తాన్‌కు చెందిన క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అతడికి అసలు పెళ్లే కాలేదు. మరి గూగుల్‌లో అతడి భార్య పేరు అనుష్కశర్మ అని ఎందుకుచూపిస్తుందనేగా మీ అనుమానం.. అతడు 2018లో రెడ్‌ ఎఫ్‌ఎంతో చాట్‌ చేస్తున్నప్పుడు తన అభిమాన హీరోయిన్లు అనుష్కశర్మ, ప్రీతిజింతా అని, అభిమాన హీరో అమీర్‌ఖాన్‌ అని చెప్పాడు. అప్పటినుంచి ఈ వార్త ట్రెండింగ్‌ అయ్యింది. రషీద్‌ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ అని వార్తలు వచ్చాయి. అప్పటినుంచి గూగుల్‌లో రషీద్‌ఖాన్‌ వైఫ్‌ అని కొట్టగానే అనుష్కశర్మ పేరు చూపిస్తున్నదట. కావాలంటే మీరూ ఓసారి సెర్చ్‌ చేసి చూడండి మరీ.. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.