మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 21, 2020 , 11:27:16

స్కాట్లాండ్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌

స్కాట్లాండ్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌

లండన్‌:  యూరప్‌లో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వేగంగా విజృంభిస్తోంది. ఇటలీ తర్వాత స్పెయిన్‌లో అత్యధికంగా కరోనా కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారిలో దాదాపు సగం మంది ఐరోపా ఖండం వాసులే. తాజాగా స్కాట్లాండ్‌ మాజీ క్రికెటర్ మజిద్‌ హాక్‌కు కరోనా  పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు 37ఏండ్ల ఆటగాడు తెలిపాడు.  గ్లాస్గోలోని రాయల్‌ అలెగ్జాండ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు వివరించాడు.

ఇంటికి తిరిగి  వెళ్లడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మజిద్‌ తెలిపాడు. వైరస్‌ నుంచి కోలుకొని త్వరగా ఇంటికి వెళ్లేందుకు   2006 నుంచి 2015 మధ్య  హాఫ్‌ స్పిన్నర్‌ హాక్‌ స్కాట్లాండ్‌ తరఫున 54 వన్డేలు, 24 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. స్కాట్లాండ్‌లో ఇప్పటి వరకు 266 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యూకేలో 3,269 మంది కరోనా బాధితులు ఉన్నారు. logo
>>>>>>