బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 29, 2020 , 00:42:58

సిడ్నీ పోరుతో షురూ

సిడ్నీ పోరుతో షురూ

  • ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా 69 రోజుల పర్యటన షెడ్యూల్‌ అధికారికంగా వెల్లడైంది. నవంబర్‌ 10న ఐపీఎల్‌ ముగిశాక 12వ తేదీన ఆసీస్‌లో అడుగుపెట్టనున్న కోహ్లీసేన.. కరోనా మార్గదర్శకాల ప్రకారం సిడ్నీలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనుంది. నవంబర్‌ 27న అక్కడే ఆతిథ్య జట్టుతో సమరం ప్రారంభించనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం ప్రకటించింది. ఆసీస్‌ పర్యటనలో భారత్‌  మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా  మెల్‌ బోర్న్‌లో జరిగే బాక్సింగ్‌  డే టెస్టుకు ప్రతి రోజు 25వేల మంది ప్రేక్షకులను అనుమ తించాలని క్రికెట్‌  ఆస్ట్రేలియా ఆలోచిస్తున్నది. 

మ్యాచ్
తేదీ
వేదిక
తొలి వన్డే
నవంబర్‌ 27
సిడ్నీ(డే/నైట్‌) 
రెండో వన్డే
నవంబర్‌ 29
సిడ్నీ(డే/నైట్‌) 
మూడో వన్డే
డిసెంబర్‌ 2
కాన్‌బెర్రా(డే/నైట్‌)
తొలి టీ20
డిసెంబర్‌ 4
కాన్‌బెర్రా 
రెండో టీ20  
డిసెంబర్‌ 6 
కాన్‌బెర్రా
మూడో టీ20 
డిసెంబర్‌ 8
సిడ్నీ 

 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 

తొలి టెస్టు
డిసెంబర్‌ 17-21
అడిలైడ్‌(డే/నైట్‌) 
రెండో టెస్టు
డిసెంబర్‌ 26-30
మెల్‌బోర్న్‌ 
మూడో టెస్టు 
జనవరి 7-11
సిడ్నీ 
నాలుగో టెస్టు 
జనవరి 15-19
బ్రిస్బేన్‌