ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 17:12:48

భారత్‌,ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్చే ప్రసక్తే లేదు:సీఏ

భారత్‌,ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్చే ప్రసక్తే లేదు:సీఏ

 మెల్‌బోర్న్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని  క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మూడో టెస్టు వేదికలో మార్పులు చేయాలని సీఏ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టు యథావిధిగా జరుగుతుందని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు  లేవని సీఏ ఆదివారం వెల్లడించింది. 

జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి మొదలవనుంది.

'మూడో టెస్టుకు ఇంకా రెండున్నర వారాల కన్నా ఎక్కువ సమయం ఉంది. నార్త్‌ సిడ్నీ బీచ్‌ల్లో కరోనా తీవ్రత, ప్రజారోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వీలవుతుంది.   మా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదు. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో మ్యాచ్‌ నిర్వహించడమే మా మొదటి ప్రాధాన్యత' అని సీఏ తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లే అధికారిక ప్రకటనలో తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

 కోహ్లీ వచ్చేస్తున్నాడు స్మిత్‌..!

4 రోజుల పాటు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్logo