ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 16:43:09

భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు

భారత అభిమానిపై  జాత్యహంకార వ్యాఖ్యలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ కొంతమంది ప్రేక్షకులు   జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బూమ్రా, మహ్మద్ సిరాజ్‌లపై జాత్యహంకార వ్యాఖ్యలతో  హేళన చేశారు. ఇదే మ్యాచ్‌లో    ఆస్ట్రేలియా భద్రతా సిబ్బంది భారత అభిమానిపై  నోరు పారేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌  సెక్యూరిటీ ఆఫీసర్‌  తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు  చేశాడని భారత అభిమాని ఒకరు అధికారులకు ఫిర్యాదు చేశారు.   ' నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో  అక్కడికే వెళ్లు' అంటూ తనతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆ అభిమాని  పేర్కొన్నాడు.  స్టాండ్స్‌లో  ఉండగా ఈ ఘటన జరిగిందని అతడు చెప్పాడు. అభిమాని ఫిర్యాదుపై సిడ్నీ స్టేడియం నిర్వాహకులు దర్యాప్తు ప్రారంభించారు.  సిడ్నీలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కృష్ణ కుమార్‌  ఇదే విషయంపై   న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేశాడు. 

ఇవి కూడా చదవండి:

కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ఇండియా 62/2
హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత

VIDEOS

logo