గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 14:22:06

9 పరుగులకే వికెట్‌ కోల్పోయిన భారత్‌

9 పరుగులకే వికెట్‌ కోల్పోయిన భారత్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు రసవత్తరంగా సాగుతోంది.

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న సెన్‌వెస్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైనదే అయినప్పటికీ ఆరంభంలో బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. గత మూడు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ భారత్‌ ఆచితూచి ఆడుతోంది. బౌలింగ్‌ విభాగంలో బలంగా ఉన్న బంగ్లాదేశ్‌ కళ్లుచెదిరే బంతులతో టీమ్‌ఇండియాను బెంబేలెత్తిస్తోంది. కనీసం సింగిల్‌ తీయడానికి వీలులేకుండా బంతులేస్తున్నారు.  ఈ క్రమంలోనే జట్టు స్కోరు 9 పరుగుల వద్ద భారత్‌ ఓపెనర్‌ దివ్యాంశ్‌ సక్సేనా(2) పెవిలియన్‌ చేరాడు.  8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 15 పరుగులే చేసింది. జైశ్వాల్‌(9), తిలక్‌ వర్మ(0) క్రీజులో ఉన్నారు. logo