శుక్రవారం 15 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 17:02:12

గంగూలీకి మూడు స్టెంట్లు.. మ‌రో 48 గంట‌లు ఆసుప‌త్రిలోనే

గంగూలీకి మూడు స్టెంట్లు.. మ‌రో 48 గంట‌లు ఆసుప‌త్రిలోనే

కోల్‌క‌తా:  బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీకి మొత్తం మూడు స్టెంట్లు వేయ‌నున్న‌ట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. ఇప్ప‌టికే యాంజియోప్లాస్టీ నిర్వ‌హించి ఒక స్టెంట్ వేశామ‌ని, మ‌రో రెండు ఆది, సోమ‌వారాల్లో వేయాల్సి ఉన్న‌ద‌ని తెలిపింది. మ‌రో 48 గంట‌ల పాటు దాదా హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది. గంగూలీ మెలుక‌వ‌గానే ఉన్నార‌ని, త‌న కూతురు స‌నాతోనూ మాట్లాడార‌ని చెప్పింది. గంగూలీకి చికిత్స కోసం ముగ్గురు డాక్ట‌ర్ల‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. మొత్తంగా మ‌రో వారం రోజుల పాటు గంగూలీకి చికిత్స కొన‌సాగుతుంద‌నీ వుడ్‌ల్యాండ్స్ ఆసుప‌త్రి త‌మ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.