మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 31, 2021 , 11:38:27

హాస్పిట‌ల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్‌

హాస్పిట‌ల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్‌

కోల్‌క‌తా: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఆదివారం ఉద‌యం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గ‌తంలో ఒక స్టెంట్ వేయించుకున్న దాదాకు గురువారం మ‌రోసారి యాంజియోప్లాస్టీ నిర్వ‌హించి రెండు స్టెంట్లు వేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ డాక్ట‌ర్ల‌యిన దేవీ శెట్టి, అశ్విన్ మెహ‌తాల‌తో కూడిన టీమ్‌.. గంగూలీకి ఈ యాంజియోప్లాస్టీ నిర్వ‌హించింది. ఈ నెల మొద‌ట్లో ఇంట్లో వ్యాయామం చేస్తున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో గంగూలీని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌రలించారు. ఐదు రోజుల త‌ర్వాత డిశ్చార్జ్ చేశారు. బుధ‌వారం మ‌రోసారి ఛాతీలో నొప్పి రావ‌డంతో దాదా మ‌రోసారి ఆసుప‌త్రికి వెళ్లారు. 

VIDEOS

logo