e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ

రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ

రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ

ముంబై: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ క‌రోనా బారిన ప‌డ్డాడ‌న్న వార్త‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పందించారు. అయితే అత‌న్ని దాదా వెన‌కేసుకొచ్చారు. అన్నిసార్లూ మాస్కు ధ‌రించ‌డం సాధ్యం కాదు అని గంగూలీ అన‌డం విశేషం. అయినా ఇంగ్లండ్‌లో ఇప్పుడు రూల్స్ కూడా మారిపోయాయి. అభిమానుల‌ను స్టేడియాల‌కు అనుమ‌తిస్తున్నారు. మనం యూరో, వింబుల్డ‌న్ చూశాం. పైగా ప్లేయ‌ర్స్ లీవ్‌లో ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ మాస్క్‌లు ధ‌రించ‌డం అసాధ్యం అని గంగూలీ అన్నారు.

యూరోలో భాగంగా ఇంగ్లండ్‌, జ‌ర్మ‌నీ మ‌ధ్య మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లిన విష‌యం తెలిసిందే. స్టేడియంలో అత‌డు మాస్క్ లేకుండానే క‌నిపించాడు. ఇలాంటి టోర్నీల‌కు వెళ్లొద్ద‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా ప్లేయ‌ర్స్‌కు మెయిల్ పంపించార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో గంగూలీ ఇలా స్పందించ‌డం గ‌మ‌నార్హం. పంత్‌కు పాజిటివ్‌గా తేల‌గా.. సాహా, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ కూడా ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ
రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ
రిష‌బ్ పంత్‌ను వెన‌కేసుకొచ్చిన బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ

ట్రెండింగ్‌

Advertisement