శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 14:54:22

మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న గంగూలీ

మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న గంగూలీ

ముంబై:  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్నాడు. బోర్డు కార్య‌ద‌ర్శి జే షా టీమ్‌తో దాదా టీమ్ బుధ‌వారం జ‌ర‌గ‌నున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్య‌మివ్వ‌నుంది. ఈ నెల 25న‌ బీసీసీఐ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ రాజీవ్ శుక్లా రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. టెన్నిస్ బాల్‌తో జ‌ర‌గనున్న ఈ మ్యాచ్‌లో బీసీసీఐ ఎల‌క్టోర‌ల్ బోర్డ్ స‌భ్యులు కూడా పాల్గొన‌నున్నారు. ఈ మ‌ధ్యే కొత్త‌గా నిర్మించిన ఈ మొతెరా ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. ఈ స్టేడియంలో 1,14,000 మంది కూర్చునే వీలుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఈ స్టేడియంలో తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. క్రిస్మ‌స్ రోజు జ‌రగ‌నున్న వార్షిక స‌మావేశంలో బీసీసీఐ కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది. 


logo