ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 05, 2020 , 21:46:49

2021 లో జెడ్డాలో నైట్ రేస్ నిర్వహించనున్న సౌదీ అరేబియా

2021 లో జెడ్డాలో నైట్ రేస్ నిర్వహించనున్న సౌదీ అరేబియా

దుబాయ్‌ : 2021 ఫార్ములా 1 క్యాలెండర్‌లో చేరిన సరికొత్త దేశంగా సౌదీ అరేబియా నిలువనున్నది. జెడ్డా నగరంలో 2021 నవంబర్‌లో ఫార్ములా 1 నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రారంభ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఫార్ములా ఈ, డాకర్ ర్యాలీ తరువాత మధ్యప్రాచ్య దేశానికి అడుగుపెట్టిన మూడవ అతిపెద్ద మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌గా ఎఫ్ 1 నిలిచింది. ఈ రేసు నగర వీధుల్లో జరుగనున్నదని, "అద్భుతమైన నైట్‌ రేసు" నిర్వహించేందుకు నిర్వాహకులు హామీ ఇచ్చారు. సింగపూర్ గ్రాండ్‌ప్రిక్స్‌ (జీపీ) కు అదనంగా వచ్చే ఏడాది క్యాలెండర్‌లో సౌదీ అరేబియా జీపీ రెండవ నైట్ రేస్‌గా అవతరించనున్నది.

ఫార్ములా 1 సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ ఫెడరేషన్ (ఎస్‌ఏఎంఎఫ్‌) తో దీర్ఘకాలిక భాగస్వామ్యంపై సంతకం చేసింది. ఇది ఎర్ర సముద్రం ఒడ్డున జెడ్డా కార్నిచ్‌లో జరుగుతుంది. అబుదాబిలో ఫైనల్‌కు వారం ముందు సౌదీ అరేబియా జీపీ నడిచే అవకాశం ఉన్నది. ఇది జట్లకు లాజిస్టిక్‌గా సౌకర్యవంతంగా ఉంటుంది. సౌదీ రాష్ట్ర ఇంధన సంస్థ అరాంకో ఈ ఏడాది మార్చిలో ఎఫ్ 1 యొక్క ప్రధాన భాగస్వామిగా మారింది. అలాగే ఈ సీజన్లో నిర్వహించిన మూడు గ్రాండ్ ప్రిక్స్ రేసులకు టైటిల్ స్పాన్సర్‌గా కూడా ఉన్నది.

సౌదీ అరేబియాను క్యాలెండర్‌కు ఎఫ్ 1 చైర్మన్, సీఈఓ చేజ్ కారీ స్వాగతించారు. "2021 సీజన్ కొరకు సౌదీ అరేబియాను ఫార్ములా 1 కు స్వాగతిస్తున్నందుకు, ఇటీవలి రోజుల్లో ఊహాగానాల అనంతరం వారి ప్రకటనను స్వాగతిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. సౌదీ అరేబియా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడలు, వినోద కేంద్రంగా మారుతున్నది. ఫార్ములా 1 వచ్చే సీజన్ నుంచి అక్కడ రేసింగ్ జరుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. సౌదీ దేశ జనాభాలో 70 శాతం మంది 30 ఏండ్లలోపు వారు ఉన్నందున.. కొత్త అభిమానులను చేరుకోవటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులను నమ్మశక్యం కాని చారిత్రాత్మక ప్రదేశం నుంచి ఉత్తేజకరమైన రేసింగ్‌కు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో మా పూర్తి తాత్కాలిక 2021 క్యాలెండర్‌ను ప్రచురిస్తాం" అని చేజ్‌ కారీ పేర్కొన్నారు.

"సౌదీ అరేబియా ఫార్ములా 1 యొక్క వేగం, శక్తి, ఉత్సాహంతో దేశం మరింత ముందుకు దూసుకుపోతుందని భావిస్తున్నాం. మా దేశ ప్రజలు ప్రత్యక్ష క్రీడలు, వినోదాల అనుభవించాలని కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని, జెడ్డాను ప్రపంచంతో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం.'' అని రాయల్ హైనెస్ ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ టర్కీ అల్ఫైసల్ అల్ సౌద్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.