శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 19:29:35

టెస్టుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే బెస్ట్‌

టెస్టుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే బెస్ట్‌


-స‌ర్ఫ‌రాజ్‌కు రమీజ్ ర‌జా సూచ‌న‌


న్యూఢిల్లీ:  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి త‌ప్పుకొని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కే ప‌రిమితం కావ‌డం మంచిద‌ని ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు ర‌మీజ్ ర‌జా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో స‌ర్ఫ‌రాజ్ స‌భ్యుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. తుది జ‌ట్టులో మాత్రం అత‌డికి చోటు ద‌క్క‌లేదు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 12వ ఆట‌గాడిగా క్రీజులో ఉన్న ప్లేయ‌ర్ కోసం స‌ర్ఫ‌రాజ్ బూట్లు తీసుకొని మైదానంలోకి వెళ్ల‌డంపై తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ అంశంపై అక్త‌ర్ తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో ర‌మీజ్ మాట్లాడుతూ.. `ఈ విష‌యాన్ని నేను పుస్త‌కంలో కూడా ప్ర‌స్తావించాను. ఒక‌సారి జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాక తిరిగి బెంచ్‌పై కూర్చోవ‌డం చాలా క‌ష్టం.స‌ర్ఫ‌రాజ్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావ‌డం మంచింది. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి త‌ప్పుకొని లిమిటెడ్ ఓవ‌ర్స్‌పై దృష్టి పెట్ట‌డం ఉత్త‌మం`అని అన్నాడు. 


logo