మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 23, 2020 , 00:37:22

సర్ఫరాజ్‌ 301

సర్ఫరాజ్‌ 301

ముంబై యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ త్రిశతకంతో కదంతొక్కాడు.

ముంబై: ముంబై యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ త్రిశతకంతో కదంతొక్కాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన గ్రూపు-బి రంజీ మ్యాచ్‌ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 353/5తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై..ఖాన్‌(391 బంతు ల్లో 301 నాటౌట్‌, 30 ఫోర్లు, 8సిక్స్‌లు) త్రిశతకంతో విజృంభించడంతో 688/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఖాన్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో తొలి ట్రిపుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ముంబై తరఫున త్రిశతకం చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు వసీం జాఫర్‌(301, 314 నాటౌట్‌), రోహిత్‌శర్మ(309నాటౌట్‌), వాడేకర్‌(323), గవాస్కర్‌(340), విజయ్‌ మర్చంట్‌ (359 నాటౌట్‌), మంజ్రేకర్‌(377) ఈ ఫీట్‌ అందుకున్నారు. 
logo
>>>>>>