గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Jul 28, 2020 , 10:24:38

సర్ఫరాజ్ అహ్మద్ మళ్లీ జట్టులోకి..

సర్ఫరాజ్ అహ్మద్ మళ్లీ జట్టులోకి..

మాంచెస్టర్:  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆగస్టు 5 నుంచి 25వ తేదీ వరకు ఇంగ్లండ్​తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం 20 మందితో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. మాజీ సారథి సర్ఫరాజ్​తో పాటు 2009 చివరగా టెస్టు ఆడిన ఫావద్ ఆలమ్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

సర్ఫరాజ్ అహ్మద్ చివరగా గతేడాది జనవరిలో టెస్టు ఆడాడు. ఆ తర్వాత ఉద్వాసనకు గురయ్యాడు. మళ్లీ దాదాపు ఏడాదిన్నర తర్వాత పాక్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్​ నుంచి ఏడాది కాలంగా విరామం తీసుకున్న సీనియర్ పేసర్ వహాబ్ రియాజ్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఇక 2009 తర్వాత టెస్టు క్రికెటే ఆడని ఓపెనర్ ఫావద్ ఆలమ్​ను ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకలుగజేసేదే. మొత్తానికి పునరాగమనం చేసిన వీరికి దీన్ని చివరి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగనుంది. కరోనా నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ఈ సిరీస్ జరుగనుంది. పాక్ జట్టుకు అజర్ అలీ కెప్టెన్సీ చేయనుండగా.. పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​కు పాకిస్థాన్ జట్టు: అజర్ అలీ(కెప్టెన్​), బాబర్ ఆజమ్​(వైస్ కెప్టెన్), అబిద్ అలీ, అసద్ షఫీక్, ఫహీమ్ అష్రఫ్​, ఫవాద్ ఆలమ్​, ఇమామ్ ఉల్ హక్​, ఇమ్రాన్ ఖాన్​, కాశీఫ్ భట్టీ, మహమ్మద్ అబ్బాస్​, మహమ్మద్ రిజ్వాన్​(వికెట్ కీపర్​), నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్​(వికెట్ కీపర్​), షాబాద్ ఖాన్​, షాహీన్ అఫ్రిది, షాన్​ మసూద్​, సొహేల్ ఖాన్​, ఉస్మాన్ షిన్వారీ, వహాబ్ రియాజ్​, యాసిర్ షా


logo