ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 03, 2020 , 20:12:02

శాంసన్‌..సూపర్‌ మ్యాన్‌: వీడియో

శాంసన్‌..సూపర్‌ మ్యాన్‌: వీడియో

ఆఖరి టీ20లో శాంసన్‌ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌ విన్యాసంతో అదరగొట్టాడు.

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కినప్పటికీ యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదే ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో శాంసన్‌ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌ విన్యాసంతో అదరగొట్టాడు. 8వ ఓవర్లో శార్దుల్‌ ఠాకూర్‌  వేసిన ఆఖరి బంతిని కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మిడ్‌వికెట్‌ మీదుగా  భారీషాట్‌ ఆడాడు. చాలా ఎత్తులో సిక్సర్‌గా వెళ్తున్న బంతిని సూపర్‌ మ్యాన్‌లా అమాంతం గాల్లోకి ఎగిరి   ఒంటి చేత్తో బంతిని పట్టుకొని బౌండరీ లైన్‌ లోపలికి విసిరేశాడు. మెరుపు విన్యాసం రెప్పపాటులో జరిగిపోయింది.  ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కేవలం  రెండు పరుగులు మాత్రమే తీశారు. దీంతో 6 పరుగులు వచ్చే  చోట కేవలం 2 పరుగులే వచ్చాయి.  శాంసన్‌ ఏకంగా నాలుగు పరుగులను సేవ్‌ చేయడంతో సహచరులు అభినందించారు.   ఈ మ్యాచ్‌లో ఇదే పెద్ద హైలెట్‌గా నిలిచిందని సోషల్‌ మీడియాలో శాంసన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


logo