మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 20:13:20

RR vs SRH: ఆచితూచి ఆడుతున్న రాజస్థాన్‌

RR vs SRH: ఆచితూచి ఆడుతున్న రాజస్థాన్‌

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ నిలకడగా ఆడుతోంది. నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప(19) రనౌట్‌ అయ్యాడు. దీంతో మరో ఓపెనర్‌ బెన్‌ స్టోక్స్‌, సంజూ శాంసన్‌ ఆచితూచి ఆడుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్‌ 47/1 స్కోరుతో నిలిచింది.  ప్రస్తుతం స్టోక్స్‌, శాంసన్‌ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ వికెట్‌ నష్టానికి 68 పరుగులు చేసింది. స్టోక్స్‌(20), శాంసన్‌(28) క్రీజులో ఉన్నారు. శాంసన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తుండగా స్టోక్స్‌ తడబడుతూనే ఉన్నాడు.