గురువారం 09 జూలై 2020
Sports - Jun 11, 2020 , 01:50:31

సంజీత డోపీ కాదు: ఐడబ్ల్యూఎఫ్‌

సంజీత డోపీ కాదు: ఐడబ్ల్యూఎఫ్‌

న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ సంజీత చాను డోపింగ్‌కు పాల్పడలేదని అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) వెల్లడించింది. ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లభించలేదని ఐడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. ‘ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు సంజీతపై మోపిన డోపింగ్‌ కేసును కొట్టివేస్తున్నాం’ అని ఐడబ్ల్యూఎఫ్‌ బుధవారం తెలిపింది. దీనిపై చాను స్పందిస్తూ.. ‘మొదటి నుంచి అదే చెబుతున్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. కానీ నేను ఇన్నాళ్లు అనుభవించిన మానసిక క్షోభకు ఐడబ్ల్యూఎఫ్‌ క్షమాపణలు చెప్పడంతో పాటు నష్టపరిహారం కట్టివ్వాలి. వారి నిర్వాకం వల్ల టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు దూరమయ్యా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు’ అని ఘాటుగా స్పం దించింది. మణిపూర్‌కు చెందిన సంజీత 2014 (గ్లాస్గో), 2018 (గోల్డ్‌కోస్ట్‌) కామన్వెల్త్‌ గేమ్స్‌ లో స్వర్ణాలు గెలిచింది. 2017 నవంబర్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు ముందు ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో 2018 మేలో ఆమెపై సస్పెన్షన్‌ వేటు పడింది.అదే సందిగ్ధత


logo