శనివారం 11 జూలై 2020
Sports - Jun 27, 2020 , 12:54:16

పాక్‌ క్రికెటర్‌కు సానియా వార్నింగ్‌

పాక్‌ క్రికెటర్‌కు సానియా వార్నింగ్‌

కరాచీ : పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌కు భారత టెన్నీస్‌ క్రీడాకారిణి వార్నింగ్‌ ఇచ్చింది. సానియా భర్త షోయబ్‌ మాలిక్‌తో ఇన్‌ష్టాగ్రామ్‌ లైవ్‌లో బాబర్‌ ఆజామ్‌ మాట్లాడుతుండగా.. సానియా వార్నింగ్‌ ఇచ్చింది. మాలిక్‌ అడిగిన ప్రశ్నలకు బాబర్‌ సమాధానలు చెప్ప్తు వచ్చాడు. ‘పాక్ క్రికెటర్ల కుటుంబాలతో నీకు మంచి అనుబంధం ఉంది కదా.. వారిలో నీకు ఇష్టమైన వదిన ఎవరు’ అని బాబర్‌ను మాలిక్‌ ప్రశ్నించగా.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ భార్య సైదా ఖుస్బత్ అని బాబర్‌ సమాధానమిచ్చాడు.

బాబర్‌కు సానియాతో మంచి స్నేహం ఉంది. కాబట్టి తన పేరు చెప్తాడనుకుంటే సైదా పేరు చెప్పడంతో సానియాకు కోపం వచ్చింది. దీంతో లైవ్‌లోనే ‘ఐ విల్‌ కిల్‌ యూ’ అని మెసేజ్‌ పెట్టి ఈ సారి ఇంటికి వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పను అని బాబర్‌పై సానియా చిరుకోపాన్ని ప్రదర్శించిందట. దీనికి  సంబంధించిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


logo