ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 05, 2020 , 21:51:56

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై కొడుకుకు సానియామీర్జా పాఠాలు

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై కొడుకుకు సానియామీర్జా పాఠాలు

న్యూఢిల్లీ: టెన్సిస్‌ స్టార్‌ సానియామీర్జా మేడంగా మారిపోయింది. ఇంట్లో తన కొడుకుకు ట్రాఫిక్‌ లైట్స్‌పై పాఠాలు బోధించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కొడుకు ముద్దుముద్దుగా సమాధానాలు చెప్పాడు. ఈ వీడియోను సానియా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  

సానియామీర్జాకు 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వివాహం జరిగింది. వారికి 2018లో కొడుకు పుట్టాడు. కొడుకు  ఇజాన్ మీర్జా మాలిక్‌కు సానియామీర్జా ట్రాఫిక్‌ లైట్స్‌పై అవగాహన కల్పించారు.  ఆమె గ్రీన్‌ అనగానే కొడుకు ‘గో’ వెళ్లండి.. అని సమాధానమిచ్చాడు. ఆరెంజ్‌ అనగానే దయచేసి వేచి ఉండండి అంటూ ముద్దులొలికే మాటలతో చెప్పాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో చాలామంది వీక్షించారు. 73,776 లైక్స్‌ వచ్చాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.