బుధవారం 08 జూలై 2020
Sports - Jun 23, 2020 , 08:39:52

సానియా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

 సానియా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాలుపంచుకుంది. యువ షట్లర్‌ పీవీ సింధు చాలెంజ్‌ను స్వీకరించిన సానియా..ఫిలింనగర్‌లోని  తన కార్యాలయ ఆవరణలో సోమవారం మూడు మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌..గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పేరుతో మంచి కార్యక్రమం చేపట్టారని పేర్కొంది. దీని వల్ల మనం ప్రకృతిని రక్షించుకోగలమని, ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతృప్తినిచ్చిందని అంది. భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మొక్కలు నాటాలని చాలెంజ్‌ విసురుతున్నట్లు సానియా తెలిపింది. 


logo