బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:20:08

ఫైనల్లో సానియా జోడీ

ఫైనల్లో సానియా జోడీ

హోబర్ట్‌: మాతృత్వం తన లయను ఏమాత్రం దెబ్బతీయలేదని నిరూపిస్తూ.. భారత స్టార్‌ సానియా మీర్జా వరుస విజయాలతో దూసుకుపోతున్నది. రెండేండ్ల విరామం తర్వాత హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీ బరిలో దిగిన ఈ హైదరాబాదీ.. అదిరిపోయే ఆటతో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో ఐదో సీడ్‌ సానియా-నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) జోడీ 7-6 (7/3), 6-2తో టమారా జిదాన్‌సెక్‌ (స్లొవేకియా)-మేరీ బౌకోవా (చెక్‌) ద్వయంపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో.. తొలి సెట్‌ హోరాహోరీగా సాగగా.. రెండో సెట్‌లో సానియా జంటకు పోటీనే లేకుండా పోయింది. శనివారం జరుగనున్న ఫైనల్లో రెండో సీడ్‌ షాయ్‌ పెంగ్‌-షాయ్‌ జాంగ్‌ (చైనా) జంటతో సానియా ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రజ్నేశ్‌కు నిరాశ..

భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పోరులోప్రజ్నేశ్‌ 6-7 (2/7), 2-6తో ఎర్నెస్ట్స్‌ గుల్బిస్‌ (లాత్వియా) చేతిలో ఓడాడు. 


logo