శనివారం 28 మార్చి 2020
Sports - Mar 08, 2020 , 23:58:04

ఇక్కడైతే భార్యకు బానిస అనేటోళ్లు

ఇక్కడైతే భార్యకు బానిస అనేటోళ్లు

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. దక్షిణాఫ్రికా సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ఈ విషయంపై భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సరదాగా స్పందించింది. స్టార్క్‌ చేసిన పనికి ఉపఖండంలోనైతే అతడిని భార్యకు బానిస అనేవారంటూ ట్వీట్‌ చేసింది. ‘అతడు ఉపఖండానికి(భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌) చెందిన వ్యక్తి(స్టార్క్‌) అయితే మరు క్షణంలోనే ‘జోరూ కా గులాం’ (భార్యకు బానిస) అని కచ్చితంగా అనేవారు. స్టార్క్‌ మంచి పనిచేశాడు’ అని సానియా ట్వీట్‌ చేసింది. 

logo