శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 01:24:02

సానియా శుభారంభం

సానియా శుభారంభం

హోబర్ట్‌: రెండేండ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో రాకెట్‌ పట్టిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా విజయంతో పునరాగమనం చేసింది. డబ్ల్యూటీఏ టోర్నీ హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ మహిళల డబుల్స్‌లో నాడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బరిలోకి దిగిన సానియా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్‌లో సానియా జోడీ 2-6, 7-6 (3), 10-3తో ఒకాసన కలస్నికోవా (జార్జియా)-మికు కటో(జపాన్‌) ద్వయంపై గెలిచింది. క్వార్టర్స్‌లో సానియా జంట.. అమెరికా జోడీ వానియా కింగ్‌-క్రిస్టినా మెక్‌హలేతో తలపడనుంది. 


ప్రజ్నేశ్‌ ముందంజ 

సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ముందంజ వేశాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో మంగళవారం ప్రజ్నేశ్‌ 6-2, 6-4తో హ్యారీ బౌర్‌చైర్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో యానిక్‌ హాఫ్‌మన్‌ (జర్మనీ)తో గుణేశ్వరన్‌ తలపడనున్నాడు.


logo