హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. టెన్నిస్ డబుల్స్ ఈవెంట్లో మెడల్‌పై ఆశలు రేపుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్.. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒలింపిక్స్‌లో ధరించబోయే జెర్సీ వేసుకొని సానియా డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్ లేటెస్ట్ హిట్ కిస్ మి మోర్ సాంగ్‌పై ఆమె డ్యాన్స్ చేసింది. తన పేరులోని ఎ అక్షరానికి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ఆమె చెప్పింది. ఎ అంటే అగ్రెషన్, ఆంబిషన్, అచీవ్, అఫెక్షన్ అని సానియా వివరించింది. ఈ పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం.
గత నెలలోనే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ టీమ్ కిట్‌ను లాంచ్ చేసింది. ఈ కిట్‌తోనే మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ మిగతా అథ్లెట్లతో కలిసి సానియా మాట్లాడింది. ఈ సందర్భంగా భారత టెన్నిస్‌కు సానియా చేసిన సేవలను మోదీ కొనియాడారు. ఈ మధ్య జరిగిన వింబుల్డన్‌లో సానియా ఆడిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె అంకితా రానాతో కలిసి డబుల్స్ బరిలో దిగనుంది.