బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 17, 2020 ,

హోబర్ట్‌ సెమీస్‌లో సానియా

 హోబర్ట్‌ సెమీస్‌లో సానియా

హోబర్ట్‌: రెండేండ్ల విరామం తర్వాత కోర్టులో అడుగుపెట్టిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా దుమ్మురేపుతున్నది. తల్లిగా మారాక కూడా తన ఆటలో ఏమాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తూ.. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా-నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) జోడీ 6-2, 4-6, 10-4తో వనియా కింగ్‌-క్రిస్టినా మెక్‌హెల్‌ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరుగనున్న సెమీఫైనల్లో టమారా జిదాన్‌సెక్‌ (స్లొవేకియా)-మేరీ బౌకోవా (చెక్‌) ద్వయం తో సానియా జోడీ తలపడనుంది. 


ప్రజ్నేశ్‌ ముందంజ

భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీ రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 1-6, 6-2, 6-1తో యానిక్‌ హాఫ్‌మన్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. ప్రజ్నేశ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఎర్నెస్ట్స్‌ గుల్బిస్‌ (లాత్వియా)తో పోటీపడనున్నాడు. మరో భారత ఆటగాడు సుమిత్‌ నాగల్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.


logo