మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 30, 2020 , 23:12:59

పంజాబ్‌కు షాక్‌.. రాజస్థాన్‌ సూపర్ విక్టరీ

పంజాబ్‌కు షాక్‌.. రాజస్థాన్‌ సూపర్ విక్టరీ

అబుదాబి : వరుస విజయాలతో దూసుకెళ్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఊహించని షాక్‌. శుక్రవారం జరిగిన  మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.  పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని  రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  బెన్‌స్టోక్స్‌(50: 26 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), సంజు శాంసన్‌(48: 25 బంతుల్లో  4ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేయడంతో రాజస్థాన్‌ అలవోకగా విజయం సాధించింది.

రాబిన్‌ ఉతప్ప(30), స్టీవ్‌ స్మిత్‌(31 నాటౌట్‌), జోస్‌ బట్లర్‌(22 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ  విజయంలో కీలకపాత్ర  పోషించారు. పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ మినహా ఏ బౌలర్‌ రాజస్థాన్‌ జోరును అడ్డుకోలేకపోయారు. అందరు బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మురుగన్‌ అశ్విన్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ తీశారు. 

అంతకుముందు క్రిస్‌గేల్‌(99: 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) శతకసమాన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో   పంజాబ్‌ 20 ఓవర్లలో 4  వికెట్లకు 185 పరుగులు చేసింది.  కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(46: 41 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌(22: 10 బంతుల్లో 3సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.  రాజస్థాన్ బౌలర్లలో బెన్‌స్టోక్స్,  జోఫ్రా ఆర్చర్‌ చెరో  రెండు వికెట్లు పడగొట్టారు.