ఆదివారం 25 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 22:44:16

IPL 2020: సంజూ శాంసన్‌ అర్ధశతకం

IPL 2020: సంజూ శాంసన్‌ అర్ధశతకం

షార్జా: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో  రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ వరుసగా రెండో అర్ధశతకం సాధించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 12వ హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో శాంసన్‌ బౌండరీల మోత మోగిస్తున్నాడు. కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను  ముందుండి నడిపిస్తున్నాడు. క్రీజులో కుదురుకున్న   శాంసన్‌ భారీ షాట్లతో చెలరేగితేనే రాజస్థాన్‌ విజయం సాధించే అవకాశముంది. మరో ఎండ్‌లో రాహుల్ తెవాటియా ఘోరంగా నిరాశపరుస్తున్నాడు. 


logo