మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 01:51:27

సామియా @ 2

సామియా @ 2

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ యువ షట్లర్‌ సామియా ఇమాద్‌ ఫారుఖి సత్తాచాటింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా ప్రకటించిన జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో సామియా రెండో ర్యాంక్‌లో నిలిచింది. అండర్‌-15 ఆసియా చాంపియన్‌ అయిన సామియా..గతేడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో నిలకడగా రాణించింది. మొత్తంగా ఆరు పాయింట్లు మెరుగుపర్చుకున్న ఈ 17 ఏండ్ల హైదరాబాదీ షట్లర్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో వరుణ్‌ కపూర్‌ నాలుగు ర్యాంక్‌లు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. జూనియర్‌ కేటగిరీలో గతేడాది ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు పోర్చుగీస్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ విజేతగా నిలిచి కీలక పాయింట్లు కైవసం చేసుకున్నాడు. పురుషుల, మహిళల విభాగాల్లో టాప్‌-10లో ఆరుగురు భారత ప్లేయర్లు ఉండటం గర్వకారణమని బాయ్‌ చీఫ్‌ హిమంత బిస్వాశర్మ పేర్కొన్నారు. 

VIDEOS

logo