శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 22, 2020 , 00:37:12

సిరాజ్‌ వ్యక్తిత్వానికి సలాం: దాదా

సిరాజ్‌ వ్యక్తిత్వానికి సలాం: దాదా

కోల్‌కతా: టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొనియాడాడు. ఊపిరితిత్తుల వ్యాధితో సిరాజ్‌ తండ్రి గౌస్‌ శుక్రవారం మృతిచెందగా.. ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న అతడు క్వారంటైన్‌ నిబంధనల కారణంగా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈ అంశంపై బీసీసీఐ అతడితో చర్చలు జరిపిందని బోర్డు కార్యదర్శి జై షా శనివారం తెలిపాడు. ‘తండ్రిని చివరిసారి చూసుకోవడం కన్నా జాతీయ జట్టుకు ఆడటమే తన కర్తవ్యమని సిరాజ్‌ పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అతడికి మా మద్దతు ఉంటుంది’ అని షా అన్నాడు. తండ్రి చివరి చూపునకు దూరమైన  సిరాజ్‌.. ఆసీస్‌ పర్యటనలో సత్తాచాటుతాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ లోటు భర్తీ చేయడం కష్టం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిరాజ్‌ మనోధైర్యంతో ఉండాలి. ఆసీస్‌ పర్యటనలో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నా’ అని దాదా ట్వీట్‌ చేశాడు.