శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 16:18:29

ధోనీ రిటైర్మెంట్ పై సాక్షి భావోద్వేగం

ధోనీ రిటైర్మెంట్ పై సాక్షి భావోద్వేగం

రాంచీ : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై ఆయన భార్య సాక్షి భావోద్వేగానికి గురయ్యారు. ధోని నిర్ణయం అతడికున్న మిలియన్ల మంది అభిమానులను మాత్రమే కాదు అతడి భార్య సాక్షిని కూడా ఉద్వేగానికి గురిచేసింది. 

సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధోని చిత్రాన్ని పోస్ట్ చేసి "మీరు సాధించిన దాని గురించి మీరు గర్వపడాలి. మీ అభిరుచికి వీడ్కోలు చెప్పేటప్పుడు మీరు మీ కన్నీళ్లను ఆపివేసి ఉండాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆటకు మీ ఉత్తమమైనదాన్ని ఇచ్చినందుకు మీకు అభినందనలు" అని రాశారు. భర్తగా మీరు సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను అని పేర్కొన్నారు. 

కొన్ని నెలల క్రితం ధోని రిటైర్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాక్షికి కోపం వచ్చింది. ధోని రిటైర్మెంట్ వార్త కేవలం పుకారు అని ట్వీట్ చేశారు. లాక్డౌన్ ప్రజలను మానసిక అనారోగ్యానికి గురి చేసిందని నేను అర్థం చేసుకోగలను ట్విట్టర్లో రాశారు. logo