గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 12:24:27

బీజేపీలో చేరనున్న సైనా నెహ్వాల్‌

బీజేపీలో చేరనున్న సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సైనా నెహ్వాల్‌ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. 29 ఏళ్ల సైనా నెహ్వాల్‌.. 20 ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. 2009లో వరల్డ్‌ నంబర్‌ 2, 2015 సంవత్సరంలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగారు సైనా నెహ్వాల్‌. ప్రస్తుతం ఆమె తొమ్మిది ర్యాంకులో ఉన్నారు. హర్యానాలోని హిస్సార్‌లో మార్చి 17, 1990న నెహ్వాల్‌ జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన వారే. 

క్రికెటర్ గౌతం గంభీర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్, రెజ్లర్ బాబిత ఫోగట్.. గతేడాది భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం విదితమే. 


logo