శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 02:18:34

సైనా ప్రాక్టీస్‌ షురూ

 సైనా ప్రాక్టీస్‌ షురూ

హైదరాబాద్‌: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో సన్నాహకాలను పునఃప్రారంభించింది. అయితే సాయ్‌ పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న జాతీయ క్యాంప్‌లో రెండు వారాల తర్వాత సైనా పాల్గొనే అవకాశం ఉంది. భర్త పారుపల్లి కశ్యప్‌ సూచనలతో సైనా ప్రస్తుతం ప్రాక్టీస్‌ చేస్తున్నది. కాగా ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆగస్టు 7వ తేదీ నుంచి గోపీచంద్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌ క్యాంప్‌ జరుగుతుండగా.. ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, సిక్కిరెడ్డి ప్రాక్టీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  


logo