మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 18, 2020 , 23:32:57

ప్లేయర్ల ప్రాణాలను గాలికొదిలారు

ప్లేయర్ల ప్రాణాలను గాలికొదిలారు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ అంతకంతకు  వ్యాపిస్తున్నా ఆర్థిక ప్రయోజనాల కోసం ప్లేయర్ల ప్రాణాలను గాలికి వదిలారని భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఆరోపించింది. ఓవైపు కొవిడ్‌-19 ప్రమాదకరంగా మారుతున్నా..బర్మింగ్‌హామ్‌లో ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీని నిర్వహించడాన్ని సైనా ట్విట్టర్‌లో తప్పుబట్టింది. ‘షట్లర్ల ఆరోగ్యాన్ని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీని నిర్వహించారు. మా కంటే వారికి ఆర్థిక అవసరాలే ఎక్కువయ్యాయి. అంతకుమించి వేరే కారణాలు ఏమిలేవు’ అని సైనా ట్వీట్‌ చేసింది. 


logo
>>>>>>