శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 00:00:40

సైనా నిష్క్రమణ

సైనా నిష్క్రమణ

 బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీ లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పో రాటం ముగిసిం ది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సైనా 20-22, 19-21తో బుసానన్‌(థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమిపాలైంది. 45 నిమిషాల పాటు జరిగిన పోరులో తుదికంటా పోరాడిన సైనాకు చివర్లో నిరాశే ఎదురైంది. పాయింట్‌ పాయింట్‌కు చెమటోడ్చిన ఈ హైదరాబాదీకి అదృష్టం కలిసిరాలేదు. ప్రత్య ర్థి కచ్చితమైన షాట్లతో చెలరేగడంతో సైనా ముందంజ వేయలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో అజయ్‌ జ యరామ్‌ 21-14, 21-15తో థామస్‌ రాక్సెల్‌(ఫ్రాన్స్‌)పై అలవోక విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించాడు. మరో సింగిల్స్‌లో సమీర్‌వర్మ 21-17, 17-21, 12-21తో కునాల్వత్‌ వితిసర్న్‌పై ఓటమిపాలయ్యాడు.  


logo