శనివారం 16 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 11:11:13

సైనాకు క‌రోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుండి ఔట్‌

సైనాకు క‌రోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుండి ఔట్‌

భార‌త ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు క్రీడాకారులంద‌రికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  ఈ ప‌రీక్ష‌లో భార‌త్ ఎస్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు క‌రోనా సోకిన‌ట్టు తేలింది.  కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలల‌పాటు ఇంటికే పరిమిత‌మైన సైనా థాయిలాండ్ ఓపెన్‌లో పాల్గొందామ‌ని సిద్ధ‌మైన స‌మయంలో సైనాకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డం పెద్ద షాకింగ్‌గా మారింది. తొలి రౌండ్‌లో మలేసియా కు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న థాయిలాండ్ ఓపెన్ నుండి సైనా పూర్తిగా త‌ప్పుకోనున్న‌ట్టు స‌మాచారం.  

హెచ్ ఎస్ ప్ర‌ణ్ణ‌య్‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో వీరిద్ద‌రిని ఆసుప‌త్రికి త‌రలించారు. సైనా భ‌ర్త ప‌రుప‌ల్లి క‌శ్య‌ప్‌ని కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, ఆయ‌న రిపోర్ట్స్ రావ‌ల‌సి ఉంది.  అయితే  కొద్ది రోజుల క్రిత‌మే సైనా క‌రోనా నుండి కోలుకోగా, ఇప్పుడు ఆమెకు మ‌ళ్ళీ  పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది.