శనివారం 16 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 18:32:20

వాళ్లకు కరోనా లేదు..సైనా, ప్రణయ్‌లకు లైన్‌ క్లియర్‌

వాళ్లకు కరోనా లేదు..సైనా, ప్రణయ్‌లకు లైన్‌ క్లియర్‌

బ్యాంకాక్‌: దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలి బ్యాడ్మింటన్‌ టోర్నీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నమెంట్‌ మంగళవారం ఆరంభమైంది. టోర్నీ మొదటి రోజే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.   భారత టాప్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌,  హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ బుధవారం తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు లైన్‌క్లియర్‌ అయింది. 

టోర్నీ ఆరంభానికి ముందు షట్లర్లకు కొవిడ్‌-19 పరీక్షలు చేయగా భారత టాప్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు  బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ మంగళవారం వెల్లడించింది.  జనవరి 11న  నిర్వహించిన మూడో రౌండ్ తప్పనిసరి పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందనేది అబద్ధమని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

బుధవారం నుంచి ఆమె టోర్నీలో పాల్గొనవచ్చని పేర్కొంది.  సైనా భర్త, షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కూడా రేపటి నుంచి బరిలో దిగనున్నాడు. సైనాతో కలిసి కాంటాక్ట్‌ అయినందున కశ్యప్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని నిర్వాహకులు ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ ముగ్గురు ప్లేయర్లు ఇవాళ టోర్నీ నుంచి విత్‌డ్రా చేసుకోవడంతో ప్రత్యర్థి క్రీడాకారులకు వాకోవర్‌ లభించింది.