గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 15, 2021 , 17:06:41

జమ్ము తొలి మహిళా పవర్‌లిఫ్టర్‌గా సైమా ఉబైద్‌

జమ్ము తొలి మహిళా పవర్‌లిఫ్టర్‌గా సైమా ఉబైద్‌

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తొలి మహిళగా సైమా ఉబైద్ అనే 24 ఏండ్ల మహిళ చరిత్ర సృష్టించింది. జమ్ముకశ్మీర్ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ 4 వ కశ్మీర్ పవర్‌లిఫ్టింగ్, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్‌ను మహిళల కోసం ప్రత్యేకంగా మొదటిసారి నిర్వహించింది. 255 కిలోల బరువును ఆవలీలగా ఎత్తి ఉబైద్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నది. ఈ క్రీడలో మహిళలు పాల్గొనడం చాలా అరుదుగా ఉంటుంది. ఏదేమైనా, అన్ని సరైన కారణాల వల్ల మూస పద్ధతులను విడదీసి ప్రతి ఒక్కరినీ తప్పుగా ఉబైద్‌ నిరూపిస్తున్నారు. తల్లి, భర్త ప్రేరణతోనే జమ్ములో తొలి మహిళా పవర్‌ లిఫ్టర్‌గా నిలువగలిగానని ఉబైద్‌ చెప్తున్నారు. 

సీనియర్‌ పవర్‌ లిఫ్టర్‌ అయిన భర్త ఉబైజ్‌ హఫీజ్‌ నుంచి ప్రేరణ పొందిన ఉబైద్‌.. చాలా రోజులుగా పవర్‌లిఫ్టింగ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తొలుత శరీరం బరువు తగ్గించుకునేందుకు జిమ్‌లో చేరినప్పుడు అధిక బరువులను ఎత్తడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నది. శరీరం బరువును తగ్గించుకుంటూ పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రావీణ్యత సాధించడంలో భర్త ఉబైజ్‌ హఫీజ్‌ శిక్షణ ఇచ్చాడు. అలా నిత్యం ప్రాక్టీస్‌ చేయడం వలన జమ్ము తొలి మహిళా పవర్‌ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది. 

పవర్‌ లిఫ్టింగ్‌లో ఉబైద్‌ చూపిస్తున్న ఆసక్తికి భర్త ఉబైజ్‌ హఫీజ్‌ శిక్షణ కూడా తోడవడంతో తక్కువ కాలంలోనే ఆమె పవర్‌ లిఫ్టర్‌గా ఎదిగారు. "పవర్ లిఫ్టింగ్‌ చేయడానికి అవసరమైన బరువులు ఎత్తడానికి ఆమెకు సహజమైన బలం ఉన్నదని నేను గుర్తించాను. అప్పుడు ఈ క్రీడ ఆలోచనను ప్రతిపాదించగా తాను అంగీకరించింది" అని ఉబైజ్‌ హఫీజ్‌ తెలిపారు. ‘పెండ్లి చేసుకుని పిల్లల్ని కన్నతర్వాత కూడా మహిళలు అంకితభావంతో ఉంటారని నిరూపించేందుకు, మహిళలు తమ కలల్ని సాకారం చేసుకునేందుకు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటుందని చెప్పడానికే పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడను ఎంచుకున్నాను’ అని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

టీమిండియా అగ్రశ్రేణి జట్టు.. ఎందుకో చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌

పెరూలో వ్యాక్సిన్‌ లొల్లి.. ఇద్దరు మంత్రులు రాజీనామా

పర్యాటక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య

పాకిస్తాన్‌లో ఇండియా ఎయిర్‌ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. ఎందుకంటే?

రాయల్‌ కుటుంబంలోకి వస్తున్న రెండో అతిథి

చరిత్రలో ఈరోజు.. వావ్‌ ఇస్రో.. ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo