e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News ఎన్‌సీసీ విద్యార్థుల కోసం హుస్సేన్‌సాగ‌ర్‌లో సెయిలింగ్ క్యాంప్‌

ఎన్‌సీసీ విద్యార్థుల కోసం హుస్సేన్‌సాగ‌ర్‌లో సెయిలింగ్ క్యాంప్‌

హైద‌రాబాద్‌: ఎన్‌సీసీ క్యాడెట్‌ల‌కు సెయిలింగ్‌లో శిక్ష‌ణ ఇవ్వ‌డం కోసం హుస్సేన్‌సాగ‌ర్‌లో సెయిలింగ్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. EME సెయిలింగ్ అసోషియేష‌న్ అధిప‌తి, లేజ‌ర్ క్లాస్ అసోషియేష‌న్ అండ్‌ కైట్ బోర్డు క్లాస్ అసోషియేష‌న్ అధ్య‌క్షుడు, యాటింగ్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్ష‌డు, లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ టీఎస్ఏ నారాయ‌ణ‌న్ చేతుల మీదుగా ఈ సెయిలింగ్ కోచింగ్ క్యాంప్ ప్రారంభ‌మైంది.

EME సెయిలింగ్ అసోషియేషన్ (EMESA), లేజ‌ర్ క్లాస్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా (LCAI) ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ కోచింగ్ క్యాంప్ కొన‌సాగ‌నుంది. ఈరోజు నుంచి సెప్టెంబ‌ర్ 25 వ‌ర‌కు హుస్సేన్‌సాగ‌ర్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల‌కు కోచింగ్ ఇస్తారు. బాయ్స్‌, గ‌ర్ల్స్ క‌లిపి భారీ సంఖ్య‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌లు ఈ క్యాంప్‌లో పాల్గొని తమ సెయిలింగ్ స్కిల్స్‌కు ప‌దును పెట్టుకోనున్నారు. ఈ క్యాంప్ ప్రారంభం సంద‌ర్భంగా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ నారాయ‌ణ‌న్ స్వాగ‌తోప‌న్యాసం చేశారు.

- Advertisement -

ఈ అరుదైన అవ‌కాశాన్ని యువ‌త సాధ్య‌మైనంత ఎక్కువ‌గా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నారాయ‌ణ‌న్ సూచించారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్న సెయిల‌ర్‌లు భ‌విష్య‌త్తులో ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ టోర్నీల్లో దేశానికి గొప్ప పేరు తీసుకొస్తార‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. కాగా, సుబేదార్ మేజ‌ర్ బీకే రౌత్ ఈ సెయిలింగ్ కోచింగ్ క్యాంప్‌కు చీఫ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త‌న కెరీర్‌లో మూడు అంత‌ర్జాతీయ‌, 22 జాతీయ ప‌త‌కాలు గెలిచిన రౌత్‌ను భావిత‌రం సెయిల‌ర్స్‌కు మంచి ప్రేర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఈ సెయిలింగ్ కోచింగ్ క్యాంప్‌లో సెయిలింగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాల‌తోపాటు వ్యూహాత్మ‌క అంశాల‌ను కూడా బోధించ‌నున్నారు. సెయిల్ ట్రిమ్మింగ్‌, ట‌క్కింగ్‌, గైబింగ్‌, రిగ్గింగ్ వాటితో సెయిలింగ్ వ్యూహాల‌ను వివ‌రించ‌నున్నారు. యువ‌తలో సెయిలింగ్‌పై అవ‌గాహ‌న పెంపొందించ‌డం, స‌మ‌ర్థులైన సెయిల‌ర్స్ త‌గిన త‌ర్ఫీదునివ్వ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సెయిలింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana