బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 00:32:32

సెమీస్‌లో సాయిదేదీప్య

సెమీస్‌లో సాయిదేదీప్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: బెంగళూరులోని రోహన్‌ బోపన్న అకాడమీ వేదికగా జరుగుతున్న టెన్నిస్‌ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్‌ సాయి దేదీప్య ఆకట్టుకున్నది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో దేదీప్య, మేఘా ముత్తుకుమారన్‌ జోడీ 6-3, 2-6, 10-4 తేడాతో లక్ష్మీ శర్వాణి, నిదిత్రా రాజ్‌మోహన్‌ ద్వయంపై విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్‌ను 6-3తో దక్కించుకున్న దేదీప్య, మేఘ జంట.. రెండో సెట్‌ను ప్రత్యర్థికి చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకుని మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది. సెమీస్‌లో శ్రావ్య శివానీ, శర్మదా బాలుతో దేదీప్య, మేఘ జోడీ తలపడే అవకాశముంది. 


logo