గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 17:16:49

ఆగ‌స్టు 25 నుంచి ఆర్చ‌రీ క్యాంప్‌

 ఆగ‌స్టు 25 నుంచి ఆర్చ‌రీ క్యాంప్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధ‌మ‌వుతున్న భార‌త ఆర్చ‌ర్ల‌కు జాతీయ శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించాల‌ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) నిర్ణ‌యించింది. ఈ నెల 25 నుంచి పుణేలో ఆర్చ‌ర్ల‌కు ప్ర‌త్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామ‌ని సాయ్ అధికారి గురువారం వెల్ల‌డించారు. రిక‌ర్వ్ జ‌ట్టులోని 16 మంది ఆర్చ‌ర్ల‌తో పాటు న‌లుగురు కోచ్‌లు ఇద్ద‌రు స‌హాయ సిబ్బందికి శిబిరానికి ముందు 14 రోజుల క్వారంటైన్ విధిగా పాటిస్తామ‌ని అన్నారు.

ఈ క్యాంప్‌లో తరుణ్‌దీప్ రాయ్‌, అతాను దాస్‌, ధీర‌జ్‌, ప్ర‌వీణ్ జాద‌వ్‌, జ‌యంత తాలుక్‌దార్‌, సుఖ్‌మాను, క‌పిల్‌, విశ్వాస్‌, దీపిక కుమారి, అంకిత, బొంబ్యాల దేవి, రిధి, మ‌ధు, హిమ‌ని, ప్ర‌మీల‌, తిష సంచేటి పాల్గొన‌నున్నారు. logo