శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 27, 2020 , 20:43:36

SRH vs DC: వృద్ధిమాన్‌ సాహా సూపర్‌..

SRH vs DC: వృద్ధిమాన్‌ సాహా సూపర్‌..

దుబాయ్:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది.  ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్(66)‌, వృద్ధిమాన్‌ సాహా(87) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో 15 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి  175 పరుగులు చేసింది.   27 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న సాహా..తర్వాత  గేర్‌ మార్చి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  సెంచరీ దిశగా సాగుతున్న సాహా  పేసర్‌ నోర్ట్జే  బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మనీశ్‌ పాండే సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్న  రబాడ, నోర్ట్జే బౌలింగ్‌లోనూ పరుగుల వరదపారించాడు.