మారడోనా కడచూపు కోసం

బ్యూనస్ ఎయిర్స్: ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా మృతితో అర్జెంటీనా శోక సంద్రంలో మునిగిపోయింది. మారడోనా భౌతికకాయంపై జాతీయ జెండాతో పాటు అతడి 10వ నంబర్ జెర్సీని కప్పి ఆ దేశ అధ్యక్ష భవనంలో సందర్శనకు ఉంచారు. అయితే తమ ఫుట్‌బాల్ వీరుడు డిగోను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు గురువారం తెల్లవారుజాము నుంచే అక్కడికి తరలివచ్చారు. మారడోనా ఫొటోలు, 10వ నంబర్ జెర్సీ పట్టుకొని వందలాది మంది రహదారులపైనే కన్నీరు మున్నీరయ్యారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారడోనా మృతితో అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించి, జాతీయ జెండా ను అవనతం చేసింది. కాగా మారడోనా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా క్రీడా, రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు కేరళ ప్రభుత్వం సైతం క్రీడారంగానికి రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
‘అర్జెంటీనాతో పాటు ఫుట్‌బాల్‌కు అత్యంత విషాదకరమైన రోజు ఇది. ఆయన వైదొలిగాడు.. కానీ మనల్ని వదిలి వెళ్లలేదు. ఎందుకంటే డిగో ఆద్యంతరహితుడు’
- మెస్సీ, అర్జెంటీనా స్టార్
డిగో మారడోనా ఫుట్‌బాల్ మాంత్రికుడు. కెరీర్ మొత్తం ప్రపంచమంతా ఆయనను ఇష్టపడింది. ఫుట్‌బాల్ మైదానం లో ఎన్నో అత్యుత్తమ సందర్భాలను ఆయన మనకు ఇ చ్చారు. ఆయన మృతి మనందరిని ఎంతో బాధిస్తున్నది. మారడోనా ఆత్మకు శాంతి చేకూరాలి.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో సాకర్
మాంత్రికునిగా మారిన మారడోనా.. తరతరాల ఫుట్‌బాల్ ప్లేయర్లకు స్ఫూర్తి
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి
‘నా స్నేహితుడికి, అపర మేధావికి గుడ్‌బై చెబుతున్నా. అసమానమైన మాంత్రికుడు ఇంత త్వరగా మనల్ని వదిలివెళ్లిపోయాడు. అయితే వెలకట్టలేని, హద్దులు లేని ఆస్తితో పాటు ఎప్పటికీ పూడ్చలేని లోటును మిగిల్చివెళ్లాడు. మిమ్మల్ని ఎప్పటికీ మరువలేం. చేతులు జోడిస్తున్నా’
- రొనాల్డో, పోర్చుగల్ స్టార్
తాజావార్తలు
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన
- ప్రతి మొక్కనూ సంరక్షించాలి : ముత్తిరెడ్డి
- రూ. 4.33 కోట్లతో వాటర్ నిర్మాణం
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం : డీసీపీ
- అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
- పార్లమెంట్ క్యాంటిన్లో నో సబ్సిడీ: ధరలు తడిసిమోపెడు
- బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?
- కరువు నేలకు జలాభిషేకం!
- టీసీఎస్ @ 3
- భారత్‌కు టిక్‌టాక్ గుడ్‌బై