ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 11, 2020 , 23:01:23

‘సచిన్ ఇచ్చిన ఆ సలహా నా కెరీర్​కు ఎంతో ఉపయోగపడింది’

‘సచిన్ ఇచ్చిన ఆ సలహా నా కెరీర్​కు ఎంతో ఉపయోగపడింది’

ముంబై: తన కెరీర్ తొలినాళ్లతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని టీమ్​ఇండియా సీనియర్ స్పిన్నర్​ హర్భజన్ సింగ్ చెప్పాడు. గురువారం కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో ఓ యూట్యూబ్ చానెల్ వేదికగా భజ్జీ మాట్లాడాడు.

“నా కెరీర్ తొలినాళ్లలో.. ఓ నెట్​ సెషన్ తర్వాత సచిన్ నాతో.. ఆటపైనే నిరంతరం ఏకాగ్రతతో ఉండాలని చెప్పాడు. అప్పటి నుంచే నేను నిజంగా నా ఆటపై మరింత ఏకాగ్రత పెట్టా. ఆ తర్వాత కొన్ని రోజులకే టీమ్​ఇండియా తరఫున అరంగేట్రం చేశా” అని హర్భజన్ సింగ్ చెప్పాడు.

1998లోనే టీమ్​ఇండియా తరఫున హర్భజన్ అరంగేట్రం చేసినా.. 2001లో  ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్​తోనే వెలుగులోకి వచ్చాడు. ఆ సిరీస్​లో గంగూలీ సేన.. కోల్​కతాలో చిరస్మరణీయ విజయం సహా ఆస్ట్రేలియాను 2-1తేడాతో చిత్తు చేసింది. ఆ సిరీస్​లో హర్భజన్ 32 వికెట్లు తీయడం సహా.. ఈడెన్​ గార్డెన్​లో హ్యాట్రిక్​తో చెలరేగాడు. ఆ సిరీస్ విజయంపైనై ఇప్పుడు హర్భజన్ మాట్లాడాడు. ఆస్ట్రేలియాపై గెలువడం ఎప్పుడైనా ప్రత్యేకమేనని, ఆ సిరీస్​తో తాను ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. 2001 సిరీస్​ వల్లే తాను ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నానని భజ్జీ చెప్పాడు. అలాగే 2007 టీ20 ప్రపంచకప్ విజయం అసాధారణమని హర్భజన్ సింగ్ చెప్పాడు. 


logo